Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్ దంచుడు... సరిగ్గా 200 పరుగులు చేసిన గుజరాత్ టైటాన్స్

Gujarat Titans posts scores 200 runs against RCB
Advertisement
  • ఐపీఎల్ లో నేడు డబుల్ హెడర్ 
  • అహ్మదాబాద్ లో గుజరాత్ టైటాన్స్ × ఆర్సీబీ
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ
Advertisement
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు సాధించింది. సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్ విజృంభించడంతో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 200 పరుగులు చేసింది. 

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దాంతో, మొదట బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ 45 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా 5, కెప్టెన్ శుభ్ మాన్ గిల్ 15 పరుగులకే అవుటయ్యారు. 

అయితే, సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్ జోడీ మూడో వికెట్ కు 86 పరుగులు జోడించి స్కోరుబోర్డును పరుగులు పెట్టించింది. సాయి సుదర్శన్ 49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. షారుఖ్ ఖాన్ 30 బంతుల్లోనే 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 58 పరుగులు చేశాడు. 

ఆఖర్లో డేవిడ్ మిల్లర్ 26 పరుగులు (నాటౌట్) సాధించాడు. ఆర్సీబీ బౌలర్లలో స్వప్నిల్ సింగ్ 1, మహ్మద్ సిరాజ్ 1, మ్యాక్స్ వెల్ 1 వికెట్ తీశారు.
Advertisement
Advertisement
Gujarat Titans
RCB
Narendra Modi Stadium
Ahmedabad
IPL 2024

More Telugu News